ట్రెండింగ్ లో లక్షద్వీప్‌.. 3 వేళ శాతం పెరిగిన గూగుల్ సర్చింగ్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన పర్యటనతో లక్షద్వీప్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. లక్షద్వీప్‌ తమకు పోటీ వస్తుందోనని ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా బాయ్‌కాట్‌ మాల్దీవులు నినాదం ట్రెండింగ్‌ అవుతోంది. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ గురించి గూగుల్ లో శోధించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది. మోదీ ఒక్క పర్యటన గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లను సమూలంగా మార్చేసింది.

జనవరి నాలుగో తేదీన భారత్‌లో అత్యధికంగా శోధించిన పదాల్లో లక్షద్వీప్‌ పదో స్థానంలో నిలిచింది. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌ కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు తెలిపాయి. శుక్రవారం రోజే 50వేల మంది లక్షద్వీప్‌ గురించి గూగుల్‌లో వెతికినట్లు వెల్లడించింది.

మరోవైపు తమ వెబ్‌సైట్‌లో లక్షద్వీప్‌ కోసం వెతుకుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌ మైట్రిప్‌ వెల్లడించింది. మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత తమ సంస్థ  సైట్లలో లక్షద్వీప్‌ కోసం శోధనలు 3 వేల 400 శాతం పెరిగాయని మేక్‌ మైట్రిప్‌ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news