ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అది తమ మేనిఫెస్టేలో లేదని చెప్పడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేసారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి అబద్ధం చెప్పారని సీరియస్ అయ్యారు. శుక్రవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చెప్పేవి అన్ని అబద్దాలు అని రుజువు చేసేందుకు స్వేదపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. ఆ స్వేదపత్రంలో సమగ్ర అభివృద్ధిని పొందుపరిచామని గణాంకాలు.. ఆధారాలతో సహ వివరించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు.. మొత్తం లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీనిని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 09 నాడు రుణమాఫీ చేస్తానని.. 2 లక్షల రుణం తెచ్చుకోండి అని రేవంత్ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు.