చంద్రబాబు వదిన కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినరే : సీఎం జగన్

-

చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరూ బీజేపీలో తలదాచుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉండే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినరే. నాకు మల్టీస్టార్ క్యాంపెయినర్లు ఎవ్వరూ లేరు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు తయారు అయ్యారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి వారు అందరూ చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లే.

రాబోయే రోజుల్లో అబద్దలాు చెబుతారు. మోసాలు ఎక్కువగా చేస్తారు. మీ దగ్గరికి వచ్చి ప్రతీ ఇంటికి వచ్చి కేజీ బంగారం ఇస్తామంటారు. బెంజీ కారు కూడా ఇస్తామంటారు. కానీ ఆలోచన చేయమని చెబుతున్నాను. మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని కోరుతున్నాను. జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో మనం నొక్కే బటన్ ను ఎందుకు నొక్కుతున్నామో మనస్సులో పెట్టుకొని ఓటు వేయాలని చెప్పారు. మీరు వేసే ఓటు ప్రతీ పేద కుటుంబం పేదరికం నుంచి బయట పడాలంటే.. జగన్ ముఖ్యమంత్రిస్థానంలో కూర్చుంటేనే జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news