హైదరాబాద్ లో ఫోరెన్సిక్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న ఏసీఈ ల్యాబ్

-

తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్ మరియు డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యా కు చెందిన ఏఈసి ల్యాబ్ జూమ్ టెక్నాలజీస్ కంపెనీ తో కలిసి హైదరాబాదులో ఫోరెన్సిక్ సెంటర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు సచివాలయం లో , ఏసీఈ లాబ్ సీఓఓ మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీఓఓ, ఆ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో భేటీ అయ్యారు.

ACE Lab To Set Up Forensic Center And Manufacturing Unit In Hyderabad

తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలపై మంత్రికి వివరించారు. ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాల గురించి వారు చర్చించారు. 129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన సాంకేతిక నిపుణులతో ఆయా సంస్థలకు తాము వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణార్ధులమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news