తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసిఆర్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసిఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో టిఆర్ఎస్ పార్లమెంటు సమావేశం జరిగింది. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు తో పాటు ఎంపీలు కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం పోరాడాలే విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి రావలసిన వాటి గురించి ప్రశ్నించాలి. కృష్ణ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని.. ఆపరేషన్ మాన్యువల్ ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తానని తెలిపారు ఉభయ సభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరి వ్యూహాలపై ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు మాజీ సీఎం కేసీఆర్.