రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 34 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రధానం చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముగ్గురిని పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది.
బుర్ర వీణ వాయిద కళాకారుడైన నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసర కొండప్పకు కేంద్రం పద్మశ్రీకి ఎంపిక అయ్యాడు. అయితే, ఒకే గ్రామానికి 2 పద్మ అవార్డులు వచ్చాయి. దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం వివేషం. యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామానికి చెందిన కేతావత్ సోంలాలుకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.. గతంలో ఇదే గ్రామానికి చెందిన రావి నారాయణరెడ్డిని కూడా పద్మశ్రీ వరించింది.దీంతో ఒకే గ్రామం నుంచి 2 పద్మ పురస్కారాలు అందుకుని చరిత్ర సృష్టించారు.