చంద్రముఖీ టీ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఎక్కుతుంది అని సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దం పేరుతో బహిరంగ సభల ద్వారా గడిచిన 57నెలల పాలనలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది, ఉద్యోగాల కల్పన చూసి ప్రజలకు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని అడిగారు. శనివారం బహిరంగ సభ ద్వారా ప్రజలు ఈసారి 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీని గెలిపించి టీడీపీ-జనసేన కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబును చంద్రముఖితో పోల్చిన జగన్ చంద్రముఖిని గత ఐదేళ్లుగా పెట్టెలో పెట్టి తాళం వేసినట్లుగా మరో ఐదేళ్లు పెట్టెలో పెట్టాలన్నారు. లంచాలు, అవినీతికి తావు లేకుండా తాను ప్రజలకే నేరుగా ఆసరా ఫించన్ లు, అమ్మఒడి, రైతుభరోసా, రుణమాఫీ వంటి వాటిని 124 సార్లు బటన్ నొక్కి నగదు జమ చేశానని ..మీరు కూడా మీ బిడ్డ జగన్ కోసం రాబోయే ఎన్నికల్లో రెండు సార్లు బటన్ నొక్కి మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. దెందులూరు సభలో జగన్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ఏకం చేసి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన జగన్ ఆపార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తన సోదరి వైఎస్ షర్మిల పేరును కూడా ప్రస్తావించకపోవడంపై రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు.