ఇలాంటి పరిస్థితిని ఎవ్వరూ ఊహించలేదు : సీఎం జగన్

-

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత ఏపీకి తీవ్రని నష్టం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 2025-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమే అన్నారు. 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కింది అన్నారు. బాబు హయాంలో 35 శాతం వరకు అయినా తగ్గింది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో ఇలా ఉంది.

 

2018-19లో 32780 వేల కోట్లు వస్తే.. 2019-20లో 28000 కోట్లు, 2020-21 24000 కోట్లు, 2021-22 36వేల కోట్లు, 2022-23లో 38వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయామన్నారు. ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులు పెరిగాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news