ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు దాదాపు సంవత్సరం తర్వాత ఊరట కలిగింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ లభించింది. తన మేన కోడలి వివాహానికి వెళ్లేందుకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు 3రోజుల బెయిల్ ఇచ్చింది. వివాహం కోసం ఫిబ్రవరి 12-16 మధ్య బెయిల్ ఇవ్వాలని కోరగా.. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది.
ఇంతకు ముందు ఆయనకు వారానికి ఒకరోజు గత 23 సంవత్సరాలుగా న్యూరో సంబంధిత వ్యాధి మల్టిపుల్ స్ల్కెరోసిస్‌తో బాధపడుతున్నా ఆయన భార్య సీమా సిసోడియా కలిసేందుకు అవకాశం కల్పించింది.మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండడం, ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది.