మేడిగడ్డ ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీ అంశం పై బీజేపీ స్టేట్ ఛీప్ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టు లోప భూయిస్టంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు వెళ్తున్నారు.. కానీ అసెంబ్లీకి రావడం లేదని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

సీఎంగా ఉన్నప్పుడు సైతం సచివాలయానికి రాలేదని.. కానీ బహిరంగ సభకు ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై కేంద్రం అథారిటీ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఏపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి డ్యామ్ గేట్లు తెరచి నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సర్కారు ఏం చేసింది..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ డ్యామేజీ కోసం కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్యేలను అందరినీ ఆహ్వానించగా.. బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడం చర్చకు దారితీసింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. బీఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందం బయటపడిందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news