అడివిశేష్ ‘జీ 2’లో విల‌న్‌గా ఇమ్రాన్ హష్మీ

-

టాలీవుడ్ యువ న‌టుడు అడివిశేష్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘జీ 2’. 2018లో శేష్‌ హీరోగా వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ‘గూఢచారి’ కి కొనసాగింపుగా ఈ సినిమా వ‌స్తుంది. ఈ సినిమాకు వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించ‌నుండ‌గా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

‘జీ 2’లో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హష్మీ న‌టించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక ఇమ్రాన్ హష్మీ మ‌రోవైపు పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్‌గా టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు.  ఇక ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో అడివిశేష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ న‌టి బ‌నితా సంధు న‌టించ‌నుంది. బ‌నితా సంధు బాలీవుడ్ మూవీ అక్టోబ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘జీ2’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఇక ఈ సీక్వెల్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టీవీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news