సీట్ల సర్దుబాటు కొలిక్కి…టీడీపీ,జనసేన,బీజేపీ పోటీ చేసే స్థానాలివే

-

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరడం ఖాయమైపోయింది. దీంతో ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీలు ఒక కూటమిగా పోటీ చేయడంపై క్లారిటీ వచ్చింది.వచ్చేసింది.మూడు పార్టీల మధ్య లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. జనసేన, బీజేపీతో కలిపి ఎనిమిది పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుండగా, టీడీపీ 17 పార్లమెంట్, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి మూడు పార్టీల అధినేతలు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.పొత్తులు,సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగియడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరిగి ఏపీకి బయలుదేరారు.పొత్తుల సారాంశాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా త్వరలోనే వివరించనున్నట్లు సమాచారం.

The muddled political scenario in AP

పొత్తులో ఒప్పందం ప్రకారం అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనుంన్నారు.అనకాపల్లి, మచిలీపట్నం స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.అయితే, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తొలుత జనసేన పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తుల నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.ఇక మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.ఎక్కువ సీట్లను గెలిచేలా ఈ కూటమి వ్యూహాలు రచిస్తోంది.

పొత్తులు,సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావడంతో చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఎన్నికల ప్రచారాలపై దృష్టి పెడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.తొలి జాబితాలో సీనియర్లను కాదని కొత్తవారికి టికెట్లు ప్రకటించారు.దీంతో సీనియర్ నేతలు కొందరు సైలెంట్ అయ్యారు.మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.అవసరం ఉన్నంతవరకూ వాడుకోవడం, అవసరం తీరాక పక్కనపెట్టేయడం చంద్రబాబుకి అలవాటుగా మారిందని సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. పొత్తు సంగతి ఎలా ఉన్నా రానున్న ఎన్నికల్లో సీనియర్ల తిరుగుబాటు తప్పేటట్లు లేదు చంద్రబాబుకి.

Read more RELATED
Recommended to you

Latest news