తెలంగాణ బీజేపీలో గెలవాల్సిన ఎంపీ సీట్ల సంఖ్యపై రాష్ట్ర నేతలకు కేంద్రమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. మంగళవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సికింద్రాబాద్ లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలని, ఇదే మన లక్ష్యమని స్పష్టం చేశారు.
దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం అని తేల్చిచెప్పారు. దేశంలోని యువత, మహిళలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మూడో సారి నరేంద్ర మోడీ భారత ప్రధాని కావడం ఖాయమని అమిత్ షా జోస్యం చెప్పారు. పదేళ్ల లో మోడీ స్థిరమైన పాలన అందించారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. మోడీ మాత్రం అవినీతి లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. మోడీ నేతృత్వంలో ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు.