మరో రెండు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

-

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాస్త వేగం పెంచారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో ఇద్దరు బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. శుక్రవారం నాగర్ కర్నూల్, మెదక్ పార్లమెంట్ రెండు స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ పి. వెంకట్రాం రెడ్డిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు. తీవ్ర కసరత్తు చేసి గెలుపు గుర్రాలను, ఎంపిక చేశారు. అయితే, తాజాగా కేసీఆర్ ప్రకటించిన రెండు ఎంపీ టికెట్లను మాజీ సివిల్ సర్వెంట్లకే కేటాయించడం గమనార్హం. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంక్రటామిరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా.. ఐపీఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీ ఇటీవల బీఎస్సీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను గులాబీ ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news