దిశ నిందితులను చంపేశారు… మరి ఆ ఎమ్మెల్యేని కూడా కాల్చేస్తారా…?

-

దిశ నిందితులు దారుణమైన నేరం చేసారు… అవును దిశ నిందితులు దారుణమైన నేరమే చేసారు… వాళ్లకు కఠిన శిక్ష విధించడమే న్యాయం… పోలీసులు వాళ్ళను కాల్చి చంపడమే సరైన శిక్ష బాధితురాలికి న్యాయం జరిగింది. ఇప్పుడు దేశంలో… దిశ హత్య కేసు నిందితుల విషయంలో ఇదే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. అత్యాచారం చేసి చంపేస్తే చంపేసి కాల్చేస్తే ఈ మాటలు మాట్లాడారు. ఒక అమ్మాయి ఏడాది క్రితం దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో అత్యాచారానికి గురైంది… 23 ఏళ్ళ బాధితురాలు ఏడాది నుంచి, న్యాయం కోసం పోరాడుతూనే ఉంది… తనకు న్యాయం జరగాలని కోర్టుల చుట్టు తిరుగుతుంది.

ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం చేసారు. అప్పుడు ప్రాణాల నుంచి బయటపడింది. తన వాళ్ళను పోగొట్టుకుంది. ఇప్పుడు కిరోసిన్ పోసి ఆమెకు నిప్పు అంటించారు. మరి దేశం ఎందుకు నిరసనలు చేయలేకపోతుంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి ఘోష దేశ వినడం లేదు. ఇందులో ఉన్నదీ బిజెపి ఎమ్మెల్యే… లక్ష మందికి పైగా ప్రజలకు ఒక ప్రజా ప్రతినిధి… అతను నిర్దోషి అని కోర్టులు చెప్పలేదు… కాని దోషి అతనే అని దేశం మొత్తం నమ్ముతుంది…

ఇప్పుడు ఆమె కోర్ట్ కి వెళ్తుంటే… అయిదుగురు ఆమె పై కిరోసిన్ పోసి నిప్పు అంటిస్తే 90 శాతం కాలిన గాయాలతో మరణించింది. ఆమెకు న్యాయం జరగాలని దేశం ఎందుకు రోడ్ల మీదకు రావడం లేదు…? దిశ నిందితులను కాల్చి చంపారు సరే… ఆ ఎమ్మెల్యేని ఎప్పుడు కాలుస్తారు…? సోషల్ మీడియా అడుగుతుంది… దేశం ఎందుకు బయటకు రావడం లేదని కూడా సోషల్ మీడియా నిలదీస్తుంది. దిశ నేరం కంటే అతి పెద్ద ఘోరం ఇది. ఆ ఎమ్మెల్యేని కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాల్చి చంపాలని, దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ ఘటనపై స్పందించి బాదితురాలికి న్యాయం చేసి అప్పుడు మాట్లాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దిశ నిందితులు బలహీనులని చంపెసారా…? ఎమ్మెల్యే బలవంతుడు అని వదిలేశారా…? అంటుంది సోషల్ మీడియా.

Read more RELATED
Recommended to you

Latest news