ఏపీలో కారు బోల్తా…ముగ్గురు మహిళలు మృతి

-

ప్రకాశం జిల్లాలో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్ ని ఢీకొట్టి కారు బోల్తా కొట్టింది.

Car overturns in AP Three women killed

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు మృతి చెందగా…మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా గుర్తించారు పోలీసులు. ఖమ్మం జిల్లా పాల్వంచ లో వివాహానికి హాజరై కందుకూరు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు గుల్లపల్లి శ్రావణి, కలపనేని దివ్య, రాయని అరుణగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news