కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది : మంత్రి కోమటిరెడ్డి

-

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతాడు. లోక్ సభ ఎన్నికల తరువాత హరీశ్ రావు బీజేపీలో చేరుతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్  పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తాం. 

నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలిందని సెటైర్లు వేశారు. కేసీఆర్ పాపాల మూలంగా కరువు వచ్చింది. యాదగిరిగుట్టపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ వేసుకున్న పాపం తగిలింది. కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతీది రాజకీయం చేయడమే కేసీఆర్ పని.. ఫోన్ ట్యాపింగ్ చిల్లర పని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news