ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌శంస‌ల జ‌ల్లు..

-

ఇటీవ‌ల పార్టీ మారతారంటూ తనపై వస్తున్న ఆరోపణలను పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఖండించిన విష‌యం తెలిసిందే. తాను పార్టీ మారుతాననేది ఊహాజనితమేనని అన్నారు. ఇదంతా మీడియా సృష్టేనని అన్నారు. ఎవరికైనా పార్టీ మారే ఆలోచన ఉంటే వాళ్లే మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను పార్టీ మారబోనని గణబాబు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన ఆయ‌న సీఎం జగన్‌కి గ్రౌండ్ లెవల్ సమాచారం కరెక్ట్‌గా వస్తోందని తెలిపారు.

ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారని అన్నారు. ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్నారని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో సమాచారం కచ్చితంగా తెప్పించుకుంటున్నారని ఎమ్మెల్యే గణబాబు వ్యాఖ్యానించారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు.అలాంటి సమాచారం నాయకుడు అనే వాడికి అవసరమని అన్నారు. దీంతో టీడీపీ షాక్‌కు గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news