మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి : చంద్రబాబు

-

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ప్రజలకు వెరైటీ విషెస్ తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం.

అయితే నేడు మీ ఆగ్రహం…ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై….ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ… ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news