దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ బాధాక‌రం… టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

-

హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశ‌పై అత్యాచారం చేసి అంతమొందించిన నలుగురు నిందితులను పోలీసులు నిర్లక్ష్యంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశ‌ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసులను ప్రశంసించారు.

ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేలు పెద్ద చర్చకు లేవనెత్తారు. ఈ అంశంపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నా తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ లేడీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మంగ‌ళ‌వారం ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఎన్‌కౌంట‌ర్లో చ‌నిపోయిన ఆ న‌లుగురు యువ‌కుల త‌ల్లిదండ్రుల‌కు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని… ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు చాలా బాధపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు టీఆర్ఎస్‌ను ఇర‌కాటంలోకి నెడుతుంది అన‌డంలో సందేహం లేదు. మ‌రి దీనిపై సీఎం కేసీఆర్‌, గులాబీ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news