టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాదిరిగా మంగళగిరి వైసీపీ అభ్యర్థి లావణ్య వద్ద డబ్బులు లేవని సీఎం జగన్ తెలిపారు. మంగళగిరి చేనేతలతో ముఖాముఖిగా మాట్లాడారు. లోకేష్ ఓటుకు రూ.6వేలు పంచుతాడు. డబ్బులిస్తే.. తీసుకోండి. వద్దనొద్దు.. కానీ జూన్, జులైలో అమ్మఒడి, చేయూత, నేతన్నహస్తం ఎవ్వరూ ఇస్తారో వారికే ఆలోచించి ఓటు వేయండి. ఎవ్వరూ ఉంటే మన పిల్లలకు నాణ్యమైన విద్య, ఉచితంగా వైద్యం అందుతుందో వారికే ఓటు వేయండని కోరారు సీఎం జగన్.
దాదాపు 50 శాతం వెనుకబడిన వర్గాల వారికి టికెట్ ఇచ్చిన ఘనత వైసీపీదే అన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఓ రికార్డు.. నామినేటేడ్ పదవుల్లో కూడా చేనేేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం. మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ది జరిగింది. అక్కా, చెల్లెమ్మెలకు రూ.1530 కోట్ల లబ్ది జరిగింది. నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్లు లబ్ది జరిగిందని తెలిపారు. టీడీపీ డబ్బు ఇస్తే.. తీసుకోండి.. కానీ ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి అని సూచించారు సీఎం జగన్.