కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా.. ఎన్డీఏ కూటమి అభ్యరికి మద్దతిచ్చిన చిరంజీవి

-

చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మెగాస్టార్ గా ఎంతటి ఇమేజ్ ను సంపాదించుకున్నారో.. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించినన్నీ స్థానాలను దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత కొద్ది రోజులకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు చిరంజీవి. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను కూడా తీసుకున్నారు చిరంజీవి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మే 13న జరిగే ఎన్నికల్లో  అధికార వైసీపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో చర్చించి పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి సీఎమ్ రమేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టికెట్ కన్ఫామ్ కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్న ఆయన తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలో చిరు.. సీఎమ్ రమేష్ కి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎన్నికల్లో గెలుస్తారని.. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. ప్రజల కోసం ఎల్లప్పుడు పాటుపడేవారికి మద్దతిస్తామని చిరంజీవి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news