అమ్మో ప్రైవేటు బ్యాంకు ఖాతాలు వద్దు బాబోయ్…! ఇదేం ఖర్మ…?

-

ప్రైవేటు సెక్టార్ లో లావాదేవీలు పెట్టుకోవడం అనేది మంచిదేనా…? గత కొన్నాళ్ళు ఈ ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది. ఇతర రంగాలు ఏమో గాని బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇప్పుడు ప్రజల్లో ప్రైవేట్ రంగం మీద కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న వ్యవహారాలతో పాటు ప్రైవేట్ బ్యాంకు ల నుంచి వస్తున్న కొన్ని ఒత్తిళ్ళు… వాళ్ళు పెడుతున్న నిభందనలు ప్రతీ ఒక్కటి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. తాజాగా ఒక వినియోగదారుడు ప్రైవేట్ బ్యాంకుల మీద ఆవేదన వ్యక్తం చేసాడు.

ఎప్పటి నుంచో మార్కెటింగ్ వ్యక్తి తిరుగుతుంటే పది వేలు పెట్టి నేను హిమాయత్ నగర్ లో ఒక ప్రైవేట్ బ్యాంకులో ఖాతా తెరిచారు. గత ఏడాది జనవరిలో ఈ ఖాతా తెరిచాను. అప్పుడు బ్యాంకు లో పది వేలు ఉండాలని అన్నారు. సరే అని చెప్పి నేను పది వేలు అందులో ఉంచి… వదిలేసాను… సరే అని డబ్బులు అవసరం ఉండి నేను ఆ పది వేలు బ్యాంకు నుంచి తీసేసాను… రెండు నెలల పాటు అందులో ఏ డబ్బులు ఉంచలేదు… తర్వాత నా మిత్రుడు ఒకరు… వరంగల్ లో బ్యాంకు లో డబ్బులు వేసాడు..

700 రూపాయలు చార్జీలు వేసారు… నాకు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. బ్యాంకు కి వెళ్తే సర్వీస్ చార్జ్ సర్ అని ఆ మార్కెటింగ్ వ్యక్తి చెప్పాడు. సరే అని వదిలేసాను… రేపు మార్చ్ వస్తుందట… ఆర్ధిక ఏడాది ముగుస్తుంది సర్… మీరు అందులో ఒక నాలుగు లక్షలు అయినా వేయండి అని ఒకడు వెంట పడతాడు, ఒకడు ఏదోక పాలసీ తీసుకోండని వెంటపడుతున్నారు… డీ మ్యాట్ ఎకౌంటు కోసం ఒకరు ఫోన్ చేస్తున్నారు… మ్యానేజర్ నుంచి కింది స్థాయి వరకు కూడా నన్ను అనేక రకాలుగా వేధిస్తున్నారు. నా భార్యకు అవసరం ఉంటుందని… జీరో బ్యాలెన్స్ ఎకౌంటు ఓపెన్ చేస్తే… అది సాధారణ ఖాతాలు వెళ్లిపోయింది… మాకు ఇదే౦ ఖర్మ…?

Read more RELATED
Recommended to you

Latest news