ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే

-

జీవనశైలిలో మార్పులు, సరికాని ఆహారం తరచుగా ఎముకల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా లేకపోతే సరిగ్గా నడవలేరు. ప్రతీ దానికి నొప్పుల సమస్యతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం నుంచి కొన్నింటిని దూరంగా ఉంచాలి. లేదంటే చీమలు తినేసిన బెల్లం గడ్డలా ఎముకలు మారిపోతాయి.
ఈ జాబితాలో ఉప్పు మొదటి స్థానంలో ఉంది. ఉప్పు లేదా సోడియం ఎముక, కీళ్ల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఆహారం నుంచి ఉప్పను దూరంగా ఉండటం మంచిది. కూరల్లో ఉప్పు తగ్గించండి. అలాగే మిగత ఆహారాల్లో ఉప్పును పూర్తిగా మానేయండి..పెరుగు, మజ్జిగ, సలాడ్స్‌ లాంటి వాటిల్లో ఉప్పు లేకుండానే తినేయొచ్చు.
Can You Build Muscle in Old Age? Yes, and an Expert Has Tips
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఎముకలకు కూడా హానికరం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు.. అది నేరుగా మన ఎముకల నాణ్యత మరియు సాంద్రతను ప్రభావితం చేస్తుంది. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించకుండా నిరోధించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు స్వీట్లు, ఐస్ క్రీమ్, కేకులు, లడ్డూలు, డెజర్ట్‌లు, చాక్లెట్లు, క్యాండీలు మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది.
ఈ జాబితాలో ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర పొటాటో చిప్స్, బర్గర్లు, పిజ్జా మొదలైనవాటిని పరిమితం చేయండి. కానీ ఈరోజుల్లో ఎక్కువ మంది తినేదే ఇది.
కార్బోనేటేడ్ పానీయాలు ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాయి. అవి చాలా చక్కెరను కలిగి ఉంటాయి. ఇది ఎముకల పెరుగుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాల్షియం నష్టాన్ని కలిగిస్తుంది.
ఇక అన్నింటికి కంటే ముఖ్యమైనది కాఫీ. కాఫీ లేని రోజును ఎవ్వరు ఊహించుకోలేరు. కానీ కాఫీలో ఉండే కెఫిన్ ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక కెఫిన్ వినియోగం ఎముక సాంద్రతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాఫీని తగ్గించండి

Read more RELATED
Recommended to you

Latest news