IPL 2024 : చెన్నై పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది. స్టోయినిస్ (124*) సెంచరీతో అదరగొట్టగా, పూరన్ 34 పరుగులు, కేఎల్ రాహుల్ 16 పరుగులు, పడిక్కల్ 13 పరుగులు, దీపక్ హూడా 17* రన్స్ చేశారు. పతిరణ 2 వికెట్లు, ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు.

Marcus Stoinis of Lucknow Super Giants 

కాగా, ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ దిగిన చెన్నై ఓపెనర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులు చేశాడు.గైక్వాడ్కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. మరో ఓపెనర్ అజింక్య రహనే ఒక్క పరుగు మాత్రమే చేశాడు.శివం దూబె 66(27 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు. దీంతో చెన్నై 20ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేసింది. మిచెల్(11), రవీంద్ర జడేజా (16) విఫలమయ్యారు. ధోనీ 4(1) రన్స్ చేశారు.ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మౌసిన్ ఖాన్ , యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news