Etala Rajendhar: ఈటల రాజేందర్ కు మద్దతు తెలిపిన పద్మశాలీలు

-

Etala Rajendhar: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతు తెలిపారు పద్మశాలీలు. బోయిన్ పల్లిలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు. కేంద్రంలోకి వెళ్లి కొట్లాడితే రూపాయి వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేయలేదు.. కెసిఆర్ అహంకారం ఏంది, ఈ కుటుంబ పాలన ఏంది, చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదు అని గ్రహించి కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని వెల్లడించారు.

కెసిఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ చేయలేకపోయారు. గ్రామాల్లోకి వెళ్తే రానివ్వరన్న భయంతోనీ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న భూముల అమ్మి ఆ డబ్బులు తీసుకొని వచ్చి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులకు చేరలేదని స్పష్టం చేశారు. లక్ష రూపాయలు కెసిఆర్ రుణమాఫీ చేయలేనప్పుడు, రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చుపెట్టగలగే శక్తి ఈ తెలంగాణ రాష్ట్ర ఖజానాలో లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు.

Padmashals who supported Etala Rajender

మాజీ ఆర్థిక శాఖ మంత్రి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా అంటున్నాడు, ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి….రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు అయితే ఉన్నాయి అనుకొని అధికారంలోకి వచ్చామో.. అదే లంకె బిందెలు తీసుకొచ్చి హామీలు నెరవేరుస్తామంటున్నాడు. 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని వెల్లడించారు. ఈ దేశం సురక్షితంగా, సుభిక్షంగా, ప్రపంచ చిత్రపటంలో ఆర్థికంగా ఎదగాలన్నా, ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే మళ్లీ బిజెపి ప్రభుత్వమే అధికారంలో కి రావాలంటున్నారని వెల్లడించారు ఈటల.

పద్మశాలీల కోసం ఎన్ని హామీలు గతంలో ఉండెనో అవన్నీ రద్దుచేయబడినప్పుడు మళ్లీ ఆ హక్కులను కల్పించాలని చెప్పి త్రిఫ్ట్ ఫండ్ కోసం అప్పటి సిఎం రాజశేఖర్ రెడ్డి తో కొట్లాడానని చెప్పారు. యాంత్రిక రంగం పెరిగిన తర్వాత మొట్టమొదట ఉపాధి కోల్పోయిన వృత్తి చేనేత వృత్తి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా వారిని నేనే పిలిపించుకొని అనేక రాయితీలు ఎప్పటికప్పుడు ఇచ్చేదని వివరించారు. రాబోయే కాలంలో మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, పరిష్కారంలో మా పాత్ర ఉంటుందని చెప్పి హామీ ఇస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news