జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. లంచాలు, వివక్ష లేని పాలన అందించాం.. చంపితే ఏమవుతుంది అంటూ.. చెడు చేయాలని కొందరు కోరుకుంటున్నారు.. ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారా ? డ్వాక్రా రుణాల బకాయి తీర్చారా ? సూపర్ సిక్స్‌ను నమ్మొచ్చా అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన జీవితకాలంలో ఏ రోజు పేదలకు మంచి చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ కొత్త కొత్త మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. 2014లోనూ ఇదే కూటమి ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసిందన్నారు సీఎం జగన్. అయితే వాటిలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదన్నారు.