Minister Roja: ఏపీ మంత్రి రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరిలో వ్యతిరేక వర్గానికి షాక్ ఇచ్చారు మంత్రి రోజా. వడమాలపేట ZPTC మురళి రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు భరత్. వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఇలాంటి పని చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మురళి రెడ్డి.
పెద్దిరెడ్డి అనుచరుడుగా ముద్రపడినా మురళి రెడ్డిపై వేటు వేయడం పై జిల్లా హాట్ టాపిక్ గా మారింది వ్యవహారం. రోజా వద్దు పార్టీ ముద్దు అని… నగరిలో రోజా ఓడిపొతుందని బహిరంగంగా ప్రెస్ మీట్ చెప్పడాన్ని తప్పు పట్టింది వైసీపీ పార్టీ. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడనే ఆరోపణలతో వేటు వేసింది వైసీపీ.