ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఏదురుదెబ్బలు బాగా తగులుతున్నాయ్.మోసాలు చేయడంలో చంద్రబాబుని మించిపోయాడు ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. పోలింగ్ దగ్గరపడుతున్న క్రమంలో చిన్ని స్కాములు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.ప్రత్యర్థి పార్టీ ఈ విషయంలో కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది.కేశినేని శివనాథ్(చిన్ని)కి చెందిన కేశినేని డెవలపర్స్ సంస్థపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(RERA)భారీ జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. చంద్రబాబు సైతం ఓ మై గాడ్ అనేలా చిన్ని వ్యవహారం తయారైంది.
రియల్ ఎస్టేట్ రంగంలో వెంచర్స్ వేస్తున్న వారు ఎవరైనా అనుమతులు తీసుకోవాలి.కానీ కేశినేని చిన్నికి చెందిన కేశినేని డేవలపర్స్ సంస్థ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేసేస్తోంది.రెరా(RERA) నిబంధనలు ఉల్లఘించి, రిజిస్ట్రేషన్ పొందకుండానే తప్పుడు సమాచారం అందచేసి నిర్మాణాలు చేపట్టడకుండానే ,కస్టమర్ల దగ్గర ఫ్రీ లాంచ్ ఆఫర్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ,ఫ్లాట్స్ మార్కెటింగ్ మరియు అమ్మకాలు చేస్తోంది. దీనిపై మండిపడిన తెలంగాణ ప్రభుత్వం….కేశినేని డెవలపర్స్ సంస్థ మరియు సాహితీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.10.74 కోట్ల అపరాధ రుసుం విధించింది.రెండు నెలల క్రితమే రుసుము విధించినా పట్టించుకోకపోవడంతో ఎన్నికల వేళ ఇబ్బందులు పడాల్సివస్తోంది.అయితే ఇపుడు కస్టమర్లకు చిక్కకుండా టీడీపీకి నేను సేవ చేస్తా చంద్రబాబుకి అండగా ఉంటా విజయవాడలో కోట్లు పెట్టీ ప్రజలను పోషిస్తా అని ఎంపి అభ్యర్థి అవతారం ఎత్తారు చిన్ని కేశినేని.
కేశినేని చిన్ని మోసాల చిట్టా చూసి ఓ మై గాడ్ అంటున్నారు చంద్రబాబు. ఈయన మోసాలు ఒక్కటి కాదు అంటూ ఆధారాలతో సహా తెర మీదకు తెచ్చిన బాదిత భాగస్వామ్యులు…కేశినేని చిన్ని చేతికి చిక్కితే చీటింగ్ కేసులు తప్పవని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.చంద్రబాబుని సైతం నమ్మించి చివరికి సీటు ఇచ్చాక చేతులెత్తేసిన ఘనుడు కేశినేని చిన్ని అంటూ పోస్టింగులు అదరగొడుతున్నాడు.చంద్రబాబునే బోల్తా కొట్టించిన గ్రేటర్ హైదరాబాద్ ఘరానా బుల్లోడు చిన్ని అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.మోసగాడికి టికెట్ ఇచ్చి ఎంపీగా పోటీ చేయించడం తగదని హెచ్చరిస్తున్నారు.