టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్‌.. వీడియో వైరల్‌

-

స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్‌ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే కొట్టిన ప్రిన్సిపాలే టీచర్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం.

పోలీసుల వివరాల మేరకు.. ఆగ్రా, సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి తరచూ పాఠశాలకు ఆలస్యంగా వస్తుండటం గమనించిన ప్రిన్సిపల్‌ ఆమెతో వాదనకు దిగారు. టీచర్‌ తిరిగి జవాబు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయిన ప్రిన్సిపల్‌ ఆ టీచర్‌పై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా దుస్తులను చింపేందుకు ప్రయత్నించారు.

మొదట వారిద్దరిని వారించడానికి ప్రయత్నించిన ప్రిన్సిపల్‌ డ్రైవర్‌ సైతం టీచర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన అంతా అక్కడున్న వారు వీడియో తీశారు.  పాఠశాలలోని మరో టీచర్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. అందులో ఇతర టీచర్లు కూడా  ప్రిన్సిపల్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఆమె స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని ఆరోపించారు. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపల్‌ సదరు టీచర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news