నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశం మొత్తం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించాయని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల పీఎఫ్ఐకి, బోధన్ నకిలీ పాస్ పోర్టులకు అడ్డాగా మారాయని ఆయన విమర్శించారు. ఆ రెండు సంస్థలు కాంగ్రెస్ కి ఫండింగ్ చేస్తున్నాయని అరవింద్ ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు కచ్చితంగా సుమారు 20వేల ధర పలుకుతుందని చెప్పానని.. గుర్తు చేసారు. ఈసారి 20వేల మార్క్ ధరను పసుపు పంట దాటడం శుభపరిణామమన్నారు. రెండు, మూడేళ్ల సంవత్సరాల వ్యవధిలోనే పసుపు పంట తప్పకుండా 30వేల ధర పలకనుందన్నారు. గతంలో రెండు, మూడేళ్లు అతి భారీ వర్షాల వల్ల పసుపు రైతులు నష్టపోయారని పసుపు పంట మురికి కుళ్లిపోయిందన్నారు.