తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. భువనగిరి జన సభలో అమిత్ షా మాట్లాడుతూ…మూడు విడతల పోలింగ్ తర్వాత 200 స్థానాలు బీజేపీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామని… 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని వివరించారు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి సన్నిహితుడు అన్నారు. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడని చురకలు అంటించారు. ప్రధాని మోడీ10 ఏళ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా రిజర్వేషన్లు తొలగించలేదన్నారు. మోడీ చెప్పిందే.. చేస్తాడన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు. రామ మందిర నిర్మాణ వాగ్దానం నెరవేర్చిన మోడీ….370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ మనదేనని దేశానికి చెప్పారన్నారు. దేశంలో తీవ్రవాదం, మావోయిజన్ని దూరం చేసి, దేశాన్ని సురక్షితం చేశాయి….అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ఆరోపణలు చేశారు.