ఇది క‌దా క్రేజ్ అంటే…జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూకి ల‌క్ష‌ల్లో వ్యూస్

-

అత్యంత జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన నేత‌గా నిలుస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. ల‌క్ష‌ల వ్యూస్ దాటిన ఆయ‌న ఇంట‌ర్వ్యూనే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. క్రికెట్ గ్రౌండ్లో స‌చిన్ టెండూల్క‌ర్ రెచ్చిపోతుంటే…ఇంకా ఏదైనా సూర్‌ప‌స్టార్ సినిమా విడుద‌లైతే అభిమానులు ఎంత‌గా స్క్రీన్‌ల‌కు అతుక్కుపోతారో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఇంట‌ర్వ్యూ కోసం అంత‌లా టీవీల‌కు ప‌రిమిత‌మ‌య్యారు అభిమానులు.క్రేజ్ అంటే ఇది క‌దా అనిపించేలా ల‌క్ష‌ల మంది జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూను చూసేశారు.సీఎం వైయస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ – 9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది. దాంతోపాటు యు ట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది.అందులో అభివృద్ధి, సంక్షేమం… వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ముఖ వార్త సంస్థ అయిన టీవీ-9కి సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ – 9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు. భూ సర్వే గురించి…ముఖ్యంగా ల్యాండ్‌ టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు… సంధించిన ప్ర‌శ్న‌ల‌కు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి…తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై పేల్చిన పంచ్ లు జనంలో బాగా పేలాయి అనే చెప్పాలి. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు…రెండో సారి చేస్తే గ్రహపాటు…. మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి.దీంతో ఇంట‌ర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోలు ప్ర‌స్తుతం వాట్స‌ప్‌ల‌లో వేగంగా స‌ర్కులేట్ అవుతున్నాయి. సీఎం జ‌గ‌న్ విజ‌న్‌ని గ‌మ‌నించిన మేధావులు అశ్చ‌ర్య‌ప‌డుతున్నారు.

ఇక ఈ ఇంట‌ర్వ్యూ లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లక్షల్లో షేర్లు… లైక్స్… కామెంట్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేగిపోయింది. మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు. ఇంకా చెప్పాలంటే చూసేవాళ్ళు కరువయ్యారు.అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు. ఒక పక్క మోడి రోడ్ షో జరుగుతున్నా, లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి.అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఎబిఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు.

ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఈమేజ్. ఈ బ్రాండే మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ఇస్తోంది. ఎన్ని ఆప‌సోపాలు ప‌డినా జ‌నాన్ని ఆక‌ర్షించ‌లేని కూట‌మి నేత‌లు సీఎం జ‌గ‌న్‌ని చూసి నేర్చుకోవాల‌ని ప్ర‌జ‌లు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news