పాకిస్థాన్ అణుశక్తికి ఇండియా కూటమి నేతలు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బిహార్ లోని ముజఫర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఇండియా అలయెన్స్లోలో పాకిస్థాన్కు భయపడే నాయకులున్నారని తెలిపారు. ‘ఒకవేళ పాకిస్తాన్ గాజులు ధరించకపోతే, మేము వాటిని ధరించేలా చేస్తాం. ఇప్పుడు వారి వద్ద ఆహార పదార్ధాలతో పాటు.. తగినన్ని గాజులు కూడా లేవని మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
తీవ్రవాదంపై పాక్కు క్లీన్ చిట్ ఇచ్చి.. సర్జికల్ స్ట్రైక్స్పై సందేహాలు లేవనెత్తే పిరికిపందలు ప్రతిపక్షంలో ఉన్నారు. వారిని జాగ్రత్తగా గమనించాలి. వారికి సంబంధించిన వామపక్ష మిత్రులు కూడా మన అణ్వాయుధాలను కూల్చివేయాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. కాగా, ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పాక్ గాజులు తొడుక్కొని ఏం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు హాజీపూర్ లోక్సభ నియోజకవర్గంలో మాట్లాడుతూ, రాజకీయ నాయకులపై దాడుల్లో ఈడీ రికవరీ చేసిన డబ్బు దేశంలోని పేదలకు సంబంధించినదని అన్నారు.