ఆ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ క్లోజ్..!

-

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మందకోడిగా కొనసాగుతోంది. ఈ సారి సాయంత్రం 6 గంటలకు వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మూడు సెగ్మెంట్లలో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ అధికారులు క్లోజ్ చేశారు. అదేవిధంగా మరో మూడు సమస్యాత్మక నియోజవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. 2019 ఓటింగ్ శాతంతో పోలిస్తే.. ఈసారి ఎక్కువగానే ఆ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదైందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news