BRS తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి అనుమతి జాప్యం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. క్యాండిల్ ర్యాలీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి జాప్యం చేస్తున్న తరుణంలోనే… కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
జూన్ 1వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కోసం అనుమతి కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి బీఆర్ఎస్ ర్యాలీ కోసం జాప్యం చేస్తుంది.
దీంతో ఇవాళ కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇక నిన్న అటు జూన్ 1వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నైపథ్యంలో గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీ కోసం జీహెచ్ఎంసీ కమీషనర్‌ని కలిసి అనుమతి కోరారు బీఆర్ఎస్ నాయకులు.