తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని… దశాబ్దం గడిచిన సందర్భమిది.ఆధునిక భారతం కళ్లరా చూసిన… మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం అన్నారు. ఒక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన…కేసీఆర్ పోరాట ఫలితమిది.
అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై… ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదని వెల్లడించారు. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి… మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిదని అన్నారు.60 ఏళ్ల విధ్వంస గాయాలను…పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణది…..పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే…మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది….తెలంగాణ ఆచరిస్తుంది..
దేశం అనుసరిస్తుందనేలా…అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణమంటూ వ్యాఖ్యానించారు. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు… దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ…..నాడు కరవు, రాళ్లురప్పాల, కల్లోలిత తెలంగాణ అన్నారు. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ అని… అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని… తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని…కాంక్షిస్తూ…ఆకాంక్షిస్తూ.ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సావ శుభాకాంక్షలు అన్నారు కేటీఆర్.