ఏం తినకపోయినా బరువు పెరిగిపోతున్నారా..? ఇలా చేయండి

-

ఈరోజుల్లో వెయిట్‌ పెరగడం అనేది అందరిని వేధించే సమస్య. ఇష్టం వచ్చినట్లు ఏదిపడితే అది తింటే బరువు పెరిగే వాళ్లు కొందరైతే.. పాపం ఏం తినకపోయినా కొందరు బరువు పెరిగిపోతుంటారు. వాళ్ల బాధ కూడా అదే.. అస్సలు నేను ఎక్కువగా ఏం తినడం లేదు అయినా ఎందుకు వారం వారానికే ఎంత వెయిట్‌ గెయిన్‌ అవుతున్నాను అని. అవును ఎందుకు..? తినకపోయినా ఎందుకు బరువుపెరుగుతారు..? మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ అధిక కొవ్వును కట్‌ చేసుకోవచ్చు.

దాల్చిన చెక్క :

పొట్టలోని కొవ్వును తగ్గించుకోవడానికి దాల్చిన చెక్కను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్కను నీటిలో నానబెట్టి భోజనం తర్వాత ఈ నీటిని తాగాలి. దాల్చిన చెక్కలో మంచి మొత్తంలో పీచు ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. మరేదైనా తినకుండా ఉంటారు.

అవిసె గింజలు :

అవిసె గింజలను తీసుకోవడం ద్వారా మీరు పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చు. అవిసె గింజలలో పెద్ద మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది మరియు త్వరగా ఆకలి వేయదు.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, భోజనానికి ముందు తాగితే బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. మీకు కావాలంటే మీరు మీ సలాడ్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా జోడించవచ్చు.

మెంతి గింజలు :

బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో మెంతులు కూడా మంచి పాత్ర పోషిస్తాయి. దీని కోసం, ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. దీన్ని ఫిల్టర్ చేసి ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

డ్రై ఫ్రూట్స్ :

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. అయితే మీరు ఈ డ్రై ఫ్రూట్స్‌ని రాత్రంతా నీటిలో నానబెట్టి, తర్వాత మాత్రమే తినాలి. పరిశోధన ప్రకారం, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి మంచి కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news