టీమిండియా హెడ్ కోచ్ పదవిపై స్పందించిన గౌతమ్‌ గంభీర్‌

-

టీమ్ఇండియా హెడ్కోచ్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపిక లాంఛనమే అని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను వెల్లడించినా గౌతీ మాత్రం సైలెంట్గానే ఉన్నాడు. తాజాగా తొలిసారి దీనిపై గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ఇండియాకు కోచ్గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తానని అన్నాడు. అబుదాబిలోని ఓ హాస్పిటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో గంభీర్ ముచ్చటించాడు.

‘ఒకవేళ మీరు టీమ్ఇండియాకు కోచ్ అయితే వరల్డ్కప్ గెలవడానికి ఎలా పని చేస్తారు’ అని ఓ విద్యార్థి గంభీర్ను అడగ్గా సమాధానం ఇచ్చాడు. ‘టీమ్ఇండియాకు కోచ్గా ఉండాలనుకుంటున్నా. మన జాతీయ జట్టుకు కోచ్గా వ్యవహరించడం కంటే గొప్పది ఇంకోటి లేదు. ఇది 140 కోట్ల మంది భారతీయలకు ప్రాతినిధ్యం వహించడం లాంటిది. అంతకంటే పెద్దది మరొకటి ఉందా? భారత్ ప్రపంచకప్ గెలవడానికి నేను ఒక్కడిని సహకరిచడం కాదు. 140 కోట్ల భారతీయులు టీమ్ఇండియా వరల్డ్కప్ నెగ్గడానికి సహకరిస్తారు. ట్రోఫీ నెగ్గాలని అందరూ ప్రార్థిస్తే, భారత్ కచ్చితంగా వరల్డ్కప్ గెలుస్తుంది’ అని గంభీర్ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news