బన్నీ ఇంత మోసగాడనుకోలేదట……!!

-

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతోంది సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్, టీజర్ వీక్షకులను ఆకట్టుకోగా మరొక సాంగ్ రేపు యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ విషయమై పలు టాలీవుడ్ వర్గాల తో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అదేమిటంటే,

Allu Arjun Ala Vaikunthapuramulo First Glimpse

వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తాం అని చెప్పిన ఈ సినిమా యూనిట్, మొన్న ఈ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేస్తామని ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన టీజర్ ని రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్పిన యునిట్, ఎట్టకేలకు చిన్న బిట్ టీజర్ ని నిన్న రిలీజ్ చేసింది. ఆ టీజర్ లో సింగర్ అర్మాన్ మాలిక్ బుట్ట బొమ్మ సాంగ్ ని ఆలపిస్తునట్లు చూపించారు. ఇప్పుడు ఇదే కొందరు ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తాం అని చెప్పిన యూనిట్, కేవలం కొద్ది సెకండ్స్ మాత్రమే నిడివి ఉన్న టీజర్ ని రిలీజ్ చేసి మాకు విసుగు తెప్పించి,

 

మా సహనాన్ని పరీక్ష చేస్తున్నారని, సాంగ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని నిరాశపరచడం సరైనది కాదని వారు అల యూనిట్ పై, అలానే బన్నీపై సోషల్ మీడియా వేదికల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో రేపు విడుదల కానున్న నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కొంత కూల్ అయినట్లు తెలుస్తోంది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news