Farmers Day : రైతు ఓటర్ అయ్యాడు గాని రైతు అవ్వలేదు…!

-

అవును రైతు ఓటర్ అయ్యాడు గాని రైతు అవ్వలేదు. రాజకీయ పార్టీల అధికార దాహంలో భాగంగా రైతుని ఓటర్ ని చేసారు, అంటే ఒక అవకాశ వాదిని చేసారు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమకు రైతుల కష్టాలు తెలుసు ఇతర పార్టీలు రైతులను కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలతో దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను తమ వైపుకి తిప్పుకోవడానికి, ఆర్ధిక సాయం, రుణమాఫీ, సబ్సిడీ వంటి హామీలను ప్రకటిస్తూ రాజకీయం చేయడం చేయడం అనేది అలవాటుగా దశాబ్దాల నుంచి మారిపోయింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడు అనే వాడు రైతులకు అందుబాటులో ఉండటం చాలా అరుదు. ప్రభుత్వాలు ఏవైనా రైతుల కోసం కార్యక్రమాలు మొదలుపెడితే మినహా ఎక్కడా కూడా కనపడని పరిస్థితి మనం చూసాం. దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళతో విపక్షాలు రాజకీయం చేయడమే గాని, ఎక్కడా కూడా వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించిన దాఖలాలు మనం చూడలేదు. మహారాష్ట్రలో ఉల్లి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు.

వాళ్ళను ఆదుకోవాలని బిజెపి నేతలు, కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ నేతలు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటు చర్చల గురించి మాట్లాడారు. కర్ణాటకలో కూడా దాదాపుగా అదే జరిగింది. ఉత్తరాఖండ్ రైతులు పెద్ద ఎత్తున దేశ రాజధాని వరకు పాదయాత్ర గా వెళ్ళారు. అయినా సరే వాళ్ళను పట్టించుకోకుండా పోలీసులతో దాడులు చేయించాయి ప్రభుత్వాలు. స్వతంత్ర భారతదేశంలో రైతు కన్నీరే గాని, రైతు నవ్వినా సందర్భం అనేది చాలా తక్కువ. అలాంటి రైతుకి రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఏ విధంగా చెప్తాం…? రైతుని సోషల్ మీడియా కోసం వాడుకునే సమాజం కూడా ఆలోచించాలి.

Read more RELATED
Recommended to you

Latest news