70 కోట్లతో 70 రోజుల్లో సినిమా..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీకి లైన్ క్లియర్ చేశాడు. సింహా, లెజెండ్ సినిమాలతో క్రేజీ హిట్లు కొట్టిన ఈ కాంబినేషన్ లో మూవీ అంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక రానున్న సినిమా అయితే బాలయ్య కెరియర్ లో ఎప్పుడు చేయని బడ్జెట్ తో సినిమా చేస్తున్నారట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 70 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం 70 రోజుల్లో సినిమా పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారత. రెండు సూపర్ హిట్లు కొట్టిన ఈ కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఆ అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను కూడా చరణ్ తో సినిమా చేస్తున్నాడు. స్టేట్ రౌడీ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా వస్తుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news