హైదరాబాద్ లో ఆ కారు ఎవరిది.. ఎన్ని వేల రూపాయలు చలానాల౦టే…?

-

ఫిలింనగర్‌లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో.. అజాగ్రత్తతో కారును నడపడంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే వేగంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్థంభంపైకి దూసుకెళ్లింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదివారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఫిలింనగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌కు వెళుతున్న వోల్వో కారు (టీఎస్‌ 06 ఈఆర్‌ 9999) బీవీబీ జంక్షన్‌ వద్దకు రాగానే అదుపు తప్పి, డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే వేగంతో పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో అతను కారును అక్కడే వదిలేసి పారిపోయాడు.

ఈ క్ర‌మ‌లోనే కారు ముందు భాగం ధ్వంసం అయింది. మ‌రియు డ్రైవర్‌ సీటులో కూర్చున్న వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీలో కారు వేగంగా వెళ్లి ఢీకొట్టినట్టు రికార్డు అయింది. ఇదిలా ఉండగా, ఈ కారు అనేక మార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలింది. కారుపై ఇప్ప‌టికే రూ.40,300 విలువైన ట్రాఫిక్‌ ఛలానాలు పెండింగ్‌లో ఉన్న‌ట్టు తెలిసింది. అయితే ఆ కారు ఎవ‌రిద‌నేది ఇంకా తెలియ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news