ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం.. రాజ్ భవన్ కి చంద్రబాబు..!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం విదితమే.  ఆ తర్వాత రాజభవన్కు వెళ్లి గవర్నర్ తో సమావేశమైన కూటమి నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్ కి అందజేశారు. సాయంత్రం లోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామని గవర్నర్ వ్యాఖ్యానించినట్టు ఎన్డీఏ కూటమి నేతలు వెల్లడించిన విషయం విదితమే.

ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. దీంతో రాజభవన్ కి చేరుకున్నారు కాబోయే ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాటు మంత్రుల కూర్పు విషయాన్ని గవర్నర్ కి వివరించారు చంద్రబాబు నాయుడు. రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్ ఫోర్ట్ కి వీఐపీల తాకిడి మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news