ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఎవరికి ఏ లాభం కలిగిందో తెలియదు గాని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి మాత్రం వ్యక్తిగతంగా రాజకీయంగా లాభం చేకూరింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. విశాఖ, అమరావతి, కర్నూలు అంటూ మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనితో ప్రాంతాల మధ్య విభేదాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దీనివలన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి మాత్రం భారీ లాభమే కలిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. విశాఖలో కెసిఆర్ కి భూములు కెసిఆర్ కి ఉన్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఆంధ్రా రాజకీయ వర్గాల్లో వినపడుతూ ఉంటాయి. దీనితో అక్కడి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇక అక్కడ కెసిఆర్ సన్నిహితులు కొంత మంది ఉన్నారు. వారు కూడా జగన్ నిర్ణయంతో లాభపడ్డారు. కెసిఆర్ అభిమానించే ఆరాధించే స్వామీజీల ఆస్తులు అన్ని కూడా విశాఖలోనే ఉన్నాయి.
ఇక హైదరాబాద్ లో ఉన్న భూముల ధరలు పెరగడం కూడా కెసిఆర్ కి కలిసి వచ్చే అంశమే. రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు ఒకసారి చూస్తే, హైదరాబాద్ కి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ వైపు చూడటం, రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్ లో పెరగడం కెసిఆర్ కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల విలువ కూడా ఈ దెబ్బకు పెరుగుతుందని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.