ఏపీ రాజధాని అమరావతి పై తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వైసీపీ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మాత్రం 2014 నుంచి కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్  రాజధాని అని అమరావతిని అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని గురించి ప్రస్తావించారు. తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం హైదరాబాద్ లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నా అన్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రో డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు. ఏపీలో వేరే ప్రభుత్వం వచ్చిందని.. మన దగ్గర ఏదో జరుగుతుందని అపోహలు వద్దని సూచించారు. బిల్డర్స్కు అన్ని అంశాల్లో బాసటగా ఉంటామన్నారు. తాము అధికారంలోకి ఆరు నెలలు అయిందని అందులో ఎన్నికల కోడ్ మూడు నెలలు ఉందని తెలిపారు. కోడ్ ముగియడంతో పాలనపై ఫోకస్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news