గత అసెంబ్లీలో కన్నీరు పెట్టడానికి కారణం ఏంటో చెప్పిన సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన విసయం తెలిసిందే. ఇవాళ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంరతం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు.  ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు అన్నారు. అలాగే గతంలో అసెంబ్లీ సభలో తనను అవమానించిన ఘటనను గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు.

” నా గురించి, నా కుటుంబం గురించి నీఛంగా మాట్లాడారు. వారిపై యాక్షన్ తీసుకుపోగా నిరసన తెలియజేయడానికి మైక్ అడిగితే ఇవ్వలేదు. అయినా రికార్డు కోసం స్టేట్ మెంట్ ఇచ్చా. ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను తప్ప మళ్లీ అడుగు పెట్టనని చెప్పాను. గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టలేదన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. నా సతీమణినే కాకుండా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారి ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా” అని అసెంబ్లీలో వివరించారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news