అసెంబ్లీలో ఇవాళ స్పీకర్ ఎన్నిక అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అందరి ఆమోదంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషకరమన్నారు. ఏ పదవీ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు వన్నె తీసుకొచ్చారని.. 66 ఏళ్ల వయస్సులో ఉన్న అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే అన్నారు చంద్రబాబు.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు చంద్రబాబు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అని అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. ఇక ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం సభ్యులకు చెప్పారు. అత్యున్నత, గౌరవ ప్రదమైన సభగా దీనిని తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే గత అసెంబ్లీలో అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పాను. కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేసినట్టు గుర్తు చేశారు చంద్రబాబు.