లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్.. ప్రొటెం స్పీకర్​కు సోనియా గాంధీ లేఖ

-

లోక్‌సభ స్పీకర్‌ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం తలెత్తి చివరకు స్పీకర్ ఎన్నికకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయనే ముందుకొచ్చారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఆయన్ను లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినా రాహుల్‌ తన నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు.

18వ లోక్‌సభకు సంబంధించి స్పీకర్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమినంతా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడటంతో ప్రతిపక్ష నేతగా స్వయంగా ఆయనే రంగంలోకి దిగాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో నాయకుల అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రొటెం స్పీకర్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేత సోనియా గాంధీ లేఖ ద్వారా సమాచారం పంపారు. గత పదేళ్ల కాలంలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉన్నట్లు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news