మంచిర్యాలలో దారుణం జరిగింది. వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలోకి అటవీశాఖ అధికారులు రానియ్యడం లేదని.. వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
మంచిర్యాల పోలంపల్లిలోని సర్వే నం. 384లో 20ఏళ్లుగా తాను సాగు చేసుకుంటున్న భూమిలోకి అటవీశాఖ అధికారులు రానియ్యడం లేదని శ్రీరాములు అనే రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.
అటు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన భైరం నర్సింహులు పంట పెట్టుబడికి తీసుకున్న అప్పులు కట్టలేక.. అప్పుల బాధతో గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
https://x.com/TeluguScribe/status/1808727217511485600